కొబ్బరి పాలతో వెల్లుల్లి కూర
- October 08, 2016
కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రేకలు - 20, కొబ్బరి కోరు - 3 టేబుల్ స్పూన్లు, కారం- 1 టీ స్పూను, జీరా, దనియా పొడి- 1 స్పూను, పసుపు- పావు టీ స్పూను, దాల్చనచెక్క- అంగుళం ముక్క, మెంతులు- అర టీ స్పూను, బియ్యం - 1టీ స్పూను, చిన్న టమోటా -1, కరివేపాకు - 4 రెబ్బలు, చిక్కటి కొబ్బరిపాలు - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: వెలుల్లి రేకల పొట్టు తీసి, ముక్కలుగా తరగాలి. కడాయిలో బియ్యం, కొబ్బరికోరు, దాల్చినచెక్క, కారం, పసుపు, జీరా, దనియాలపొడులు సన్నని మంటపై (మాడకుండా) వేగించాలి. తర్వాత మిక్సీలో వేసి టమోటాతో పాటు గ్రైండు చేసుకోవాలి. ఈ పేస్టుని వెల్లుల్లి ముక్కలకు పట్టించి కరివేపాకుతో పాటు కప్పు నీరు పోసి ఉడికించాలి. వెల్లుల్లి ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరిపాలు, ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అన్నంతో పాటు చపాతీల్లో కూడా ఈ కూర బాగుంటుంది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







