'ప్రేమమ్' లోని నా కర్లీ జుట్టు ఓ ఫ్యాషన్ అయ్యింది
- October 08, 2016
చెప్పకుండా వచ్చి వరించేదే అదృష్టం. ఆ అదృష్టం 'ప్రేమమ్' సినిమా రూపంలో వర్ధమాన కథానాయిక అనుపమా పరమేశ్వరన్‌ను వరించింది. ఈ ఒక్క సినిమా ఆమెకు అరడజను సినిమాలకు సమానమైన పేరుని తెచ్చిపెట్టింది. ఎందుకంటే మొత్తం దక్షిణాదిలో భాషాతీతంగా 'ప్రేమమ్' విజయవంతమైంది. భాష తెలీకున్నా కథలోని భావాన్ని ఆస్వాదించారు ప్రేక్షకులు. ఈ సినిమాలో ఉంగరాలు తిరిగిన జుట్టుతో 'మేరీ' పాత్రలో నటించిన అనుపమ.సహజమైన నటనతో ప్రేక్షకులకు అభిమాన తారగా మారిపోయింది.'అ..ఆ', 'ప్రేమమ్' రీమేక్ తో తెలుగు తెరకొచ్చిన అనుపమా పరమేశ్వరన్‌చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చేందుకు అమ్మ కథలు చెప్పేది. ఆ కథల్లో అందమైన యువరాణులు ఉండేవారు. నేనే ఆ యువరాణిని. అని ఊహించుకుంటూ కథలు వినేదాన్ని. ఈ ఆసక్తి నటనలో అభిరుచి పెంచుకునేందుకు అంకురమైంది. అలా బాల్యంలోనే నటిగా మారాలని నిర్ణయించుకున్నా. ఏడో తరగతి చదువుతుండగా 'ఇన్నర్ స్పేస్ లిటిల్ థియేటర్' లో చేరా. అక్కడ నటనలో ఓనమాలు నేర్చుకున్నాను. చదువుతో పాటే ఈ శిక్షణ తీసుకోవడం కొనసాగించాను. కొట్టాయంలోని సీఎంఎస్ కాలేజీలో ఇంటర్ చేస్తున్నప్పుడు 'ప్రేమమ్' కోసం ఆడిషన్స్ జరిగాయి. టీనేజ్ లో ఉన్న అమ్మాయి 'మేరీ ' పాత్ర సినిమాలో కీలకమైంది. ఆ క్యారెక్టర్ కోసం దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ నన్ను ఎంపిక చేశారు. ఆ రోజు నా జీవితంలో మరిచిపోలేనిది. కల నిజమైన అనుభూతి కలిగింది.
అమ్మ చెప్పిన కథల్లో రాకుమారి అద్దంలో నా రూపంలో కనిపించింది. 'ప్రేమమ్' షూటింగ్ మొదలైంది. నాకు కర్లీ జుట్టు ఉండేది. అదే గెటప్ లో మేరీ గా నటించాను. నటించాలనే తపన తప్ప 'ప్రేమమ్' చిత్రీకరణ సమయంలో సినిమాల గురించి ఇంకేమీ తెలియదు. చూస్తుండగానే ఆ సినిమా పూర్తి అయ్యింది. విడుదల రోజు ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూశాను. మా అంచనాలకు మించి విజయాన్నందుకుంది 'ప్రేమమ్' . ప్రతి ఒక్కరు తమని తాము పోల్చుకునేలా ప్రేమానుభూతులను పంచిన ఈ సినిమా పేరు కేరళ అంతటా మార్మోగిపోయింది.దాంతో నా జీవితం పూర్తిగా మారిపోయింది. నటిగా గుర్తింపు, ఎక్కడికి వెళ్లినా అభిమానులు, వాళ్లకు ఆటోగ్రాఫ్ లు ఇవ్వడం, ఫొటోలు దిగడం.సెలబ్రిటీ అయిపోయాను. 'ప్రేమమ్' ఒక్క కేరళలోనే కాదు మొత్తం దక్షిణాదిలో ఘన విజయాన్ని అందుకుంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగులో అవకాశాలు తలుపుతట్టాయి. తమిళంలో ధనుష్ సరసన 'కోడి', తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అ..ఆ' , 'ప్రేమమ్' రీమేక్ లో నటించాను. వీటితో పాటు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కానీ వచ్చిన సినిమాలన్నీ చేయాలని నాకు లేదు. కథ, క్యారెక్టర్ బాగుండి, నాకు నచ్చిన వాటినే ఎంచుకుంటున్నాను. అందుకే 'ప్రేమమ్' లాంటి బిగ్గెస్ట్ హిట్ వచ్చినా..నా కెరీర్ లో ఎక్కువ సినిమాలు మీకు కనిపించడం లేదు.'అ..ఆ' లో నాది నాయిక పాత్ర కాదు .. అయినా త్రివిక్రమ్ మంచి దర్శకుడని తెలిసి ఒప్పుకున్నాను. నాకు ప్రతినాయకి ఛాయలున్న పాత్రలంటే ఇష్టం. 'నాగవల్లి' పాత్ర అలాంటిదే. ఈ సినిమా సమయంలో త్రివిక్రమ్ రూపంలో నాకో మంచి స్నేహితుడు, గురువు దొరికారు. నేను ఎలాంటి చిత్రాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటివి చేయొద్దు. అనే సలహాలు ఆయన ఇస్తుంటారు. ఇక నాగచైతన్యతో 'ప్రేమమ్' రీమేక్ లో నటించడం మరో మంచి అనుభూతి. చందూ మొండేటి అంకితభావమున్న దర్శకుడు. నాగచైతన్య వినయంగా ఉంటారు. మేరీ పాత్రనే ఇక్కడ హేమ గా చేస్తున్నాను. ఈ పాత్ర మేరీ కంటే పరిణితితో కనిపిస్తుంది. కారణం నటిగా నాకు వచ్చిన అనుభవమే. ప్రతిభ గల నటీనటులంటే నాకు ఆరాధనా భావం. నేనూ వాళ్లలా మంచి నటిని కావాలని కోరుకుంటాను. జీవితంలో ప్రేమ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. నేనూ ప్రేమలో పడ్డాను. ఆ సంగతులు తర్వాత చెబుతాను.'ప్రేమమ్' లోని నా కర్లీ జుట్టు ఓ ఫ్యాషన్ అయ్యింది.అమ్మ సునీత, నాన్న పరమేశ్వరన్, నాకో తమ్ముడు ఉన్నాడు పేరు అక్షయ్.
నాన్న విదేశాల్లో పనిచేస్తుంటారు.హీరోయన్ గా పేరొచ్చినా..మా ఊరిలో ఇరుగు పొరుగు ఇప్పటికీ నన్ను చిన్నపిల్లగానే చూస్తుంటారు.జీవితంలో అన్నీ దొరకవు. సినిమా అవకాశాలు పెరగడంతో చదువు తాత్కాలికంగా ఆపేశాను. 'ప్రేమమ్' చేస్తున్నప్పుడు కొన్ని సెలవులు తీసుకున్నా కళాశాల వాళ్లు ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు షూటింగ్ ల కోసం నెలల తరబడి వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది. తరువాతైనా చదువు కొనసాగిస్తాను.
కుటుంబ ప్రోత్సాహం లేకపోతే ఇక్కడిదాకా రాను. నేను ఏ కెరీర్ లో ఉన్నా క్షేమంగా ఉండాలని నా కుటుంబం కోరుకుంటుంది
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







