పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా ఒత్తిడితీసుకురావడంలో నరేంద్రమోదీ విజయం..
- October 08, 2016
పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా ఒత్తిడితీసుకురావడంలో నరేంద్రమోదీ విజయం సాధిస్తున్నారు. ప్రపంచ దేశాలనుంచి ఏకాకిని చేస్తూ కరివే'పాక్' పరిస్థితి కల్పించారు . ఊహించని విధంగా సర్జికైల్ స్ట్రైక్ చేసి పాక్ దిమ్మతిరిగేలా చేశారు. దీంతో మోదీని ఎదుర్కోవడం ఆ దేశానికి తలనొప్పిగా మారిందా? పాకిస్థాన్ విదేశాంగ ఉన్నతాధికారుల్లో మోదీని ఎలా ఎదుర్కోవాలో అనే విషయంలో గందరగోళం ఏర్పడిందా? మోదీపై ప్రభుత్వ నేతలు, ఉన్నతాధికారులు తలోమాట మాట్లాడుతున్నారా? తాజా పరిస్థితులను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు విదేశీ వ్యవహరాల్లో కీలక సలహాదారులైన ఇరువురు ఉన్నతాధికారులు తలోరకంగా మాట్లాడటం సంచలనంగా మారింది.మోదీ పాలనలో ఇండో, పాక్ సంబంధాలు దెబ్బతినవని తాను భావిస్తున్నట్టు పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ కు ఫారిన్ అడ్వైజర్ సర్తాజ్ అజిజ్ తెలిపారు. ప్రభుత్వం ఇండోపాక్ బార్డర్ ను 2018 వరకు మూసివేయండం ఇండియాకు సంబంధించిన విషయమని దాని వలన వచ్చే ఇబ్బందేమీ లేదని అన్నారు. అజీజ్ మాట్లాడిన కొద్ది సేపటికే షరీఫ్ కు అంతర్జాతీయ ప్రత్యేక దూత ముషాహిద్ హుస్సేన్ సయిద్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ కు ప్రధాన శత్రువు మోదీయేనని చెప్పారు. మోదీ ఢిల్లీ రాజకీయాల నుంచి రాలేదని, ఒంటరి మనస్తత్వం గల మోదీ ప్రచ్ఛన్న యుద్ధానికే మొగ్గు చూపుతున్నారని ధ్వజమెత్తారు. కాసేటికే సయిద్ మాటమారుస్తూ.. మోదీ పాకిస్థాన్ విషయంలో యూటర్న్ తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. కశ్మీర్ విషయంలో ఇరుదేశాలు శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా మరింత ప్రయత్నం చేయాలన్నారు. ఇండియా, పాక్ సంబంధాలు ఇరుదేశాల అభివృద్ధికి అవసరమని అన్నారు. న్యూక్లియర్ సప్లై గ్రూపులో పెద్ద పీట వేయమని ఇండియా గట్టిగా కోరాలని సలహా సైతం ఇచ్చారు. ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ సమ్మిట్ కు మోదీ హాజరవుతారని, షరీఫ్ తో ఆలింగనం చేసుకునే రోజు వస్తుందని సయిద్ జోస్యం చెప్పారు. సెప్టెంబర్ 18 న ఉడీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసి 19 మందిని జవాన్ల ను చంపిన విషయం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్30న ఇండియా సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఆదేశంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు జరిపి 40 మంది ఉగ్రవాదులను హతమార్చిన అనంతరం ఇరుదేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం ఏర్పడింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







