తొలిసారిగా దుబాయ్ లో 'యు.ఏ.ఈ తెలుగు వైద్యుల' ఆత్మీయ సమావేశం 2016
- October 09, 2016
దుబాయ్ లో మొట్టమొదటిసారిగా యు.ఏ.ఈ తెలుగు వైద్యుల ఆత్మీయ సమావేశం 2016 కు విశేష స్పందన లభించింది. దాదాపు100 మంది తెలుగు వైద్యులు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో 350 మందికి పైగా హాజరైనారు. పలువురు తెలుగు వైద్యుల కూడిక ద్వారా అద్భుతమైన పరస్పర అవగాహన కొనసాగడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. తెలుగు వైద్యుల మధ్య తొలిసారిగా జరిగిన ఈ కార్యక్రమం వాతావరణం పండుగ సందడిని మరిపించింది. ఈ సమావేశం ద్వారా తొలిసారిగా ఒకరినొకరు పరిచయం చేసుకొని ఆత్మీయంగా సంభాషించుకొన్నారు. వైద్యులు తమను తాము పరిచయం చేసుకొని ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. శ్రీ రియాజుద్దీన్ ద్వారా "యుఎఇ మెడికల్ ఎడ్యుకేషన్" గూర్చి ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత డాక్టర్.రాజీవ్ లోచన్ ద్వారా "ఆరోగ్యకరమైన గుండె" గూర్చి ఒక చక్కని సందేశం అందచేయబడింది. యుఎఇ తెలుగు వైద్యుల ఆత్మీయ సమావేశం 2016 నిర్వాహక సభ్యులు డాక్టర్ హరీష్, జాఫర్ ఆలీ, కేసరి త్రిమూర్తులు, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ కోడి రామ, డాక్టర్ నారాయణ, డాక్టర్ సౌజన్య, డాక్టర్ వెంకట సీతా రాంబాబు ఉన్నారు.ఈ కార్యక్రమములో మన తెలుగు వారు దువ్వూరు కిషోర్ బాబు,తులసి ప్రసాద్, అరుణ్ కుమార్, శ్యామ్,గౌస్ మొహమ్మద్ ,శ్రీకాంత్ చిత్తర్వు తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







