బూడిద గుమ్మడిలో ఔషధ గుణాలు....
- October 09, 2016
ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం. ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ ఎన్నో ఉన్నాయి. బూడిద గుమ్మడి కాయలోనూ విత్తనాల్లోనూ తీగలోనూ కూడా ఔషధ గుణాలున్నాయని వైద్యులు అంటారు. కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం, దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే మలబద్దకంతో బాధపడే వాళ్ళు రోజూ బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్దకం తగ్గుతుందట. అంతేకాదు ఈ విత్తనాల నుంచి తీసిన నూనెని చర్మవ్యాధుల నివారణలో వాడుతుంటారు. ఇంకా బూడిద గుమ్మడి తీగ రసాన్ని హై బిపి, నిద్రలేమితో బాధపడేవారికి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. అంతేకాదు... బరువు కూడా తగ్గిపోవచ్చు. బూడిదగుమ్మడి కాయ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి వడియాలు మాత్రమే. కానీ చలికాలంలో పిందె తొడిగి, వేసవి వరకూ పెద్దపెద్ద కాయలు కాసే ఈ గుమ్మడితో పసందైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. అంతేకాదు, నీరు ఎక్కువుండే బూడిదగుమ్మడిలో కార్బొహైడ్రేట్లు, కొవ్వు అతి తక్కువ శాతం ఉండటంతో డైటింగ్ చేసే వారికి మంచి ఆహారము. బూడిద గుమ్మడి కాయ తొక్క, గింజలు కొబ్బరి నునెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకులకు రాస్తే జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







