పుదీనా - రాజ్మా బిర్యాని
- October 09, 2016
కావలసిన పదార్థాలు : బియ్యం - కేజీ, పుదీనా - నాలుగు కట్టలు, రాజ్మా గింజలు - 200 గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - ఆరు, నూనె - 100గ్రా, నెయ్యి - 100గ్రా, లవంగాలు - 6
దాల్చినచెక్క - చిన్న ముక్కలు నాలుగు, ఉప్పు - తగినంత
తయారీ విధానం :
ముందురోజు రాత్రి రాజ్మా గింజల్ని నానబెట్టాలి. బిర్యానీ తయారు చేయడానికి ముందు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. కాడలు లేకుండా పుదీనా ఆకులను తుంచి శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నెలో నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రాజ్మాగింజలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా పేస్టు వేసి దోరగా వేయించి తగినంత నీరు పోసి ఉప్పు వేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే పుదీనా - రాజ్మా బిర్యానీ రెడీ అయినట్లే.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







