ఢిల్లీలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి వేడుక
- October 09, 2016
ఈ ఏడాది విజయదశమి చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత సైన్యం ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి వివాదాలు ముసిరిన నేపథ్యంలో మోదీ వాటిని ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీన్ దయాళ్ జీవితం, ఆయన బోధనలకు సంబంధించిన 15 పుస్తకాలను మోదీ విడుదల చేశారు.అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ''ఈ ఏడాది మన దేశానికి విజయదశమి చాలా ప్రత్యేకమైనది'' అని అన్నారు. దసరా పండుగ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సైనిక శక్తి సమర్థవంతంగా ఉంటేనే.. దేశం బలంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్పారు. మనం బలంగా ఉండటం అంటే ఎదుటి వారికి వ్యతిరేకంగా ఉన్నట్టు కాదని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. మన సామర్థ్యం కోసం ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటే.. అది పొరుగు వారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నట్టుగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎద్దేవా చేశారు. మానవతా వాదం గురించి కృషి చేసిన గొప్ప వ్యక్తి ఉపాధ్యాయ అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







