డ్రగ్స్ కేసు: బహ్రెయినీ జంటకి రిమాండ్ పొడిగింపు
- October 09, 2016
మనామా: డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బహ్రెయినీ జంటకు మరో 15 రోజులపాటు రిమాండ్‌ని పొడిగించారు. న్యాయస్థానం తెలిపిన వివరాల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జంట, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టయ్యారు. 14,260 గ్రాముల షాబు, అలాగే 12 నార్కోటిక్ పిల్స్‌ని స్మగుల్ చేస్తూ వీరు దొరికారు. విశ్వసనీయ వర్గాల సమాచారం సేకరించి, పోలీసులు వారిని వ్యూహాత్మకంగా అరెస్టు చేయడం జరిగింది. పట్టుబడ్డవారిలో మహిళ, పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మలేసియాలో బహ్రెయినీ వ్యక్తి ఒకరు ఆ డ్రగ్స్‌ని స్మగుల్ చేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఇంకో వైపున, సదరు మహిళకు ఆమె భార్య డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేసే అలవాటు ఉందన్న విషయం తెలియదని మహిళ తరఫు లాయర్ న్యాయస్థానానికి చెప్పారు. ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసినా, బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం తిరస్కరించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







