దుబాయ్‌లో రాత్రి వేళల్లో స్విమ్మింగ్‌పై వార్నింగ్
- October 09, 2016
దుబాయ్: రాత్రి వేళల్లో స్విమ్మింగ్‌పై సోషల్ మీడియా ద్వారా దుబాయ్ మునిసిపాలిటీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ప్రమాదాల కారణంగా, రాత్రి వేళల్లో బీచ్‌లలో స్విమ్మింగ్‌పై నిబంధనల్ని కఠితనరం చేశారు అధికారులు. బ్యాచిలర్స్ రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలనీ, బీచ్‌లలో స్విమ్మింగ్ చేయరాదని అధికారుaలు స్పష్టం చేశారు. అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయాల్లో స్విమ్మింగ్ ప్రమాదకరం అని ప్రచారం చేస్తున్నారు. రెడ్ ఫ్లాగ్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేయరాదనీ, ఎల్లో ఫ్లాగ్ ఉన్నప్పుడు తగు జాగ్రత్తలతో స్విమ్మింగ్‌కి బీచ్‌లలో అనుమతిస్తారనీ అధికారులు తెలిపారు. బీచ్‌లలో భద్రత కోసం పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని వారు వివరించారు. వీటితోపాటుగా బీచ్‌లలోతప్ప, బయట స్విమ్మింగ్ డ్రెస్‌తో తిరగరాదనీ, ఫొటోగ్రఫీ పూర్తిగా నిషేధమనీ, బార్బిక్యూ, షిషా వంటివి నిషిధ్దమని అధికారులు స్పష్టం చేశారు. పెంపుడు జంతువుల్ని బీచ్‌లలోకి అనుమతించరు. నిబంధనల్ని అతిక్రమించినవారికి జరీమానాలు విధించడంతోపాటు, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







