"మోదీ.. మోదీ.." నినాదాలతో మార్మోగిన దుబాయ్ క్రికెట్ స్టేడియం!!

- August 17, 2015 , by Maagulf

 

 

 

 

దుబాయ్‌లోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం వినేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. స్టేడియం కెపాసిటీ 30 వేలు. అయితే మరో 20 వేల మందికి ఏర్పాట్లు చేశారు. మరో 20 వేల మంది స్టేడియం బయట మోదీ ప్రసంగం వినేందుకు తహతహలాడుతున్నారు. స్టేడియం బయట భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. దుబయ్ మినీ ఇండియాను తలపిస్తోంది. మోదీ మోదీ నినాదాలతో స్టేడియం పరిసరాలు మార్మోగాయి.

 

                           --- ఎం. వాసుదేవ రావు (మాగాల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com