వారానికి 42.4 గంటల సగటున పని చేస్తున్న దుబాయ్ ఉద్యోగులు

- October 12, 2016 , by Maagulf
వారానికి 42.4 గంటల సగటున  పని చేస్తున్న దుబాయ్ ఉద్యోగులు

దుబాయ్: సంవత్సరం పొడవునా దుబాయిలో మండే ఎండల నడుమ కఠిన జీవనశైలి గురించి మర్చిపోతే; ఇప్పుడు దుబాయ్ లో పని పట్ల  ప్రేమ కనబర్చడానికి మరొక కారణం ఉంది.

ప్రపంచ నివేదిక ఇటీవల ఎమిరేట్ లో తెలిపిన సమాచారం మేరకు ఉద్యోగులు వారి వ్యక్తిగత జీవితం మరియు సజావుగా  పని సాగించే  విషయంలో పనిచేసే ఉద్యోగులకు ఇదే ఉత్తమ ప్రాంతమని  తేలింది.తాజాగా  యుబిఎస్ వార్షిక ధరలు మరియు సంపాదన అనే విషయంలో 2015  జరిగిన ఒక నివేదికలో 71 ప్రపంచ నగరాలలో ఉత్తమమైన నిష్పత్తిగా ఇది నమోదయింది. దుబాయ్ లో పనిచేసి గంటల సంఖ్య యొక్క సరాసరి సంవత్సరానికి  2,035.2 గంటల పని చేస్తున్నట్లుగా ఒక రేటు రికార్డ్ కాగా, ఇది వారానికి 42.4 గంటలకు  చేరుకుంది"  అదే విధంగా, వారికి  ఇచ్చిన సగటు సెలవుల విషయానికి వస్తే,  సంవత్సరానికి అవి  30 రోజులుగా ఉంది. మీకు  యు ఏ ఇ లో పని గంటలు గురించి అస్పష్టంగా సమాచారం కనుక ఉంటే, కార్మిక నిబంధన 65, అది స్పష్టంగా చెపుతుంది. దీనిని మంత్రిత్వశాఖ చేత నిర్వచించబడింది: వయోజన కార్మికులకు సాధారణ పని గంటల గరిష్ట సంఖ్య రోజుకు ఎనిమిది గంటలు, లేదా వారానికి  నలభై ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంది. గంటల సంఖ్య ఇతర ఉద్యోగాలలో పని చేసే వారికి  రోజుకు తొమ్మిది గంటల పెంచవచ్చు వాణిజ్యం, హోటళ్లు, ఫలహారశాలలు, భద్రత మరియు ఇతర ఉద్యోగాలకు దీనిని వర్తింపచేసుకోవచ్చు. కార్మిక శాఖ మంత్రిత్వశాఖ  నిర్ణయ అనుమతితో దీనిని తయారు చేస్తారు.
యుబిఎస్ వార్షిక ధరలు మరియు సంపాదన అనే విషయంలో 2015 నివేదిక ప్రకారం భారతదేశం లో పని గంటల సంఖ్య ప్రస్తావిస్తే,  వారానికి 42.6 గంటల పని న్యూ ఢిల్లీ లో కాగా , ముంబై నగరంలో వారానికి పని 43.8 గంటల సగటు రికార్డు కాగాఉద్యోగులు సంవత్సరానికి 2,276.6 గంటల  సగటు పని చేస్తున్నట్లు వివరించింది.హాంగ్ కాంగ్ లో వారానికి  50.1 గంటల పాటు పని చేస్తున్న ఉద్యోగులుగా  అత్యంత పని గంటల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈజిప్ట్ రాజధాని కైరో లో అమలు కాబడుతున్న పని గంటల విషయమై నివేదిక ప్రకారం, బొగటా, కొలంబియా యొక్క పని గంటలు పోలిఉంటుంది వారానికి 40.3 గంటల పాటు సగటు పని గంటలు ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రపంచ నివేదిక తదుపరి జకార్తా ఇండోనేషియా రాజధాని ప్రాంతాలలో వారానికి సగటున 40.3 గంటలు  పనిచేస్తున్నట్లు సంవత్సరానికి 12 సెలవులు మాత్రమే అక్కడ ప్రజలు తీసుకొంటున్నట్లు సర్వే తెలియచేస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com