నారా, నందమూరి హీరోల పోటి

- October 12, 2016 , by Maagulf
నారా, నందమూరి హీరోల పోటి

వెండితెర మీద ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. నారా, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు యువ కథనాయకులు బాక్సాఫీస్ ముందు తలపడేందుకు రెడీ అవుతున్నారు. పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.
నారా రోహిత్, రెజీనా జంటగా తెరకెక్కిన శంకర సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమాను ఈ సారి ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
దీంతో వెండితెరపై నారా, నందమూరి హీరోల పోటి తప్పేలా కనిపించటం లేదు. మరి ఈ పోటిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com