ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం" టీమ్ 5"
- October 12, 2016
ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి క్రికేటర్ నే కాదు మంచి డ్యాన్సర్ అని ఈచిత్రంతో తెలుస్తుంది. రాజ్ జకారిస్ ప్రోడ్యూసర్ గా తన ప్రొడక్షన్ వాల్యూస్, సురేష్ గోవింద్ చెప్పిన కథ, కథనం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. పదునైన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ ను హడలెత్తించిన శ్రీశాంత్... నటనలోనూ అంతే చలాకితనం, అంతే పట్టుదలను చూపించారు. ఇందులో శ్రీశాంత్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. తన క్యారెక్టర్ తో పాటు, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్, గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ పెయిర్ చూడముచ్చటగా ఉండనుంది. వీరితో పాటు పెర్ల్ మానే, మఖరంద్ దేశ్ పాండే ఇతర పాత్రలు పోషించారు. గోపి సుందర్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంభందిచిన సాంగ్స్ చిత్రీకరణ ఆస్ట్రేలియాలో ని మెల్‌బోర్న లో జరుపుకుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ... ఇండియన్ మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించే అదృష్టం మాకు లభించినందుకు చాలా ఆనందంగా వుంది. ఆయన అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. శ్రీశాంత్ ని హీరోగా పరిచయం చేయాలన్న మా డ్రీమ్ కంప్లీట్ అయ్యింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ కావడంతో మాంచి ఎనర్జితో చేస్తున్నాడు. డైలాగ్స్, డ్యాన్సులు, ఫైట్స్ ఇరగదీస్తున్నారు. కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. టీమ్ 5 అనే టైటిల్ కు తగ్గట్టుగా మా దర్శకుడు సురేష్ గోవింద్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ని మెల్బోర్న్ లో సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో లో రిలీజ్ చేయబోతున్నాం. త్వరలోనే మరిన్ని వివరాల్ని తెలియజేస్తాం. అని అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







