తెలుగులో విడుడల కానున్న 'కాబిల్'
- October 12, 2016
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్-రాకేష్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న థ్రిల్లర్ 'కాబిల్'. గతంలో 'క్రిష్', 'క్రిష్ 3', 'కోయి మిల్ గయా', 'కహో నా ప్యార్ హై' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ 'కాబిల్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో హృతిక్ సరసన యామీ గౌతమ్ నటిస్తున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 26న విడుదల అవుతోంది.
ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
గతంలో హృతిక్ నటించిన 'క్రిష్' చిత్రాలు, 'ధూమ్ 2' చిత్రం తెలుగులో విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హృతిక్‌కు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో సినిమాను తెలుగులో భారీగా విడుదల చేసేందుకు సిద్ధపడినట్లు నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







