జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల హతం
- October 12, 2016
జమ్మూకశ్మీర్‌లోని పాంపోర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులకు తెరపడింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్త అభివృద్ధి సంస్థ(ఈడీఐ) భవనంలోని సోమవారం ఉదయం చొరబడిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు భవనాన్ని చుట్టుముట్టి వారిపై ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఉగ్రవాదుల్ని తుదముట్టించేందుకు వీలుగా భద్రతా బలగాలు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముష్కరులు తప్పించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను మూసివేసి వారిపై ఒత్తిడి పెంచారు.
ఇరువర్గాల మధ్య సుమారు 60 గంటల పాటు కాల్పులు జరిగాయి.
ఈడీఐ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి నెలలోనూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. 48గంటల పాటు సాగిన నాటి దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ ప్రభుత్వోద్యోగి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







