భోగన్ మూవీ కోసం సాంగ్ పాడిన అరవింద్ స్వామి

- October 13, 2016 , by Maagulf
భోగన్ మూవీ కోసం సాంగ్ పాడిన అరవింద్ స్వామి

అందాల కథానాయకుడిగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అరవింద్ స్వామి, ఆ తరువాత పూర్తి సమయాన్ని తన బిజినెస్ కి కేటాయించాడు. ఈ మధ్యనే ఆయన ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన జయం రవి హీరోగా చేసిన 'తని ఒరువన్' సినిమాలో విలన్ గాను నటించి మెప్పించాడు. అదే కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా తెరకెక్కుతోంది. 'భోగన్' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకి ప్రభుదేవా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో అరవింద్ స్వామి ఒక పాట పాడటం విశేషం. సంగీత దర్శకుడు ఇమామ్ కోరిన మేరకు అరవింద్ స్వామి పాడిన ఈ పాట, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com