ఈ నెల 15న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' టీజర్‌

- October 13, 2016 , by Maagulf
ఈ నెల 15న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' టీజర్‌

నిఖిల్‌ కథానాయకుడిగా వి ఆనంద్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈ చిత్రం టీజర్‌ను అక్టోబరు 15న విడుదల చేస్తున్నట్లు నిఖిల్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. 'టీజర్‌ను అక్టోబరు 15న విడుదల చేస్తున్న విషయాన్ని షేర్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం' అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌, నందితా శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. మేఘనా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి చంద్రశేఖర్‌ యేలేటి స్వరాలు సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com