ప్రకాశించే చర్మం కోసం ఇంట్లో తయారు చేసుకునే మాస్క్ లు...
- October 13, 2016
రోజు వారి టెన్షన్ లతో పాటూ మన అందం కూడా తగిన శ్రద్ధ వచించాలి, అందంగా కనపడితేనే చుట్టూ ఉండే వారిలో మనకంటూ ప్రత్యేకత, "ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్" అనే ఆంగ్ల సూక్తి వంద శాతం నిజమే. ఎందుకంటే మనం ఎదుటి వారిని ఇంప్రెస్ చేయటంలో అందం ముఖ్యపాత్ర పోషిస్తుంది, అవునా! ప్రస్తుతం మనం అనుసరించే బిజీ జీవనశైలిలో అందానికి కూడా తగిన సమయం వెచ్చించాల్సిందే. ఇక అందంగా కనపడటంలో మన చర్మం ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి మెరిసే చర్మాన్ని పొందుటకు బయట లభించే ఉత్పత్తుల కన్నా, తక్కువ సమయంలో మన ఇంట్లోనే తయారు చేసుకునే మాస్క్ ల గురించి కింద తెలుపబడింది.
తెలుగులో ప్రకాశించే చర్మం కోసం ఉత్తమ ఇంట్లో మాస్క్ లు
ఇంట్లో తయారు చేసుకునే మాస్క్ లు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చటమే కాదు, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇంట్లోనే తయారు చేసుకునే విషరహిత పదార్థాలతో తయారు చేస్తాము కావున ఎలాంటి దుష్ప్రభాలను చూపకుండా సహజంగా చర్మతేజస్సును మెరుగుపరుస్తాయి. కావున వీటి వలన ప్రమాదాలు కలుగుతాయని చింతించాల్సిన అవసరం లేదు.
మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, ఆకర్షణీయమైన చర్మ రూపును అందించే మాస్క్ ల గురించి ఇక్కడ తెలుపబడింది.
అవకాడో ఫేస్ మాస్క్
సగం అవకాడోను తీసుకొని దంచండి, వెంటనే దీనికి ఒక చెంచా తేనె మరియు సేంద్రియా యోఘర్ట్ ను కలపండి. చేతివేళ్ళ కొనల సహాయంతో ముఖానికి అప్లై చేయండి లీడా ఫౌండేషన్ బ్రెష్ సహాయంతో ముఖానికి అప్లై చేసి కనీసం 60 నిమిషాల పాటూ అలాగే వదిలేయండి. మెరిసే చర్మాన్ని పొందాలి అనుకునే వారికి ఇదొక మంచి చిట్కాగా పేర్కొనవచ్చు.
తేనె మరియు అరటిపండు ఫేస్ మాస్క్
దంచిన అరటిపండుకు ఒక చెంచా కలిపి తయారు చేసిన ఫేస్ మాస్క్ చాలా శక్తివంతంగా పని చేస్తుంది. ఈ రెండు మిశ్రమాలను కలిపి బాగా కలపండి. చేతి వేళ్ళ కొనలతో లేదా బ్ర్రేష్ తో ముఖానికి ఆపాదించండి. కనీసం 15 నిమిషాల పాటూ అలాగే వేచి ఉన్న తరువాత నీటితో కడిగి మార్పులను గమనించండి.
నారింజ, పెరుగు మాస్క్
ఒక చెంచా పెరుగు మరియు ఒక నారింజ పండు నుండి రసాన్ని తీసుకోండి. రెండింటిని బాగా కలిపి, చేతి వేళ్ళతో ముఖానికి అప్లై చేయండి. పది నిమిషాల పాటూ ఉంచి, చల్లటి నీటితో కడిగి వేయండి.
మట్టితో చేసిన ఫేస్ మాస్క్
మట్టితో చేసే ఫేస్ మాస్క్ ఇంట్లో తయారు చేసే వాటిలో చాలా ప్రాముఖ్యమైనది గా చెప్పవచ్చు. ముందుగా మట్టిని తీసుకొని నీటిని పోస్తూ నెమ్మదిగా కలపండి. పేస్ట్ రూపంలో వచ్చే వరకు బాగా కలపండి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల కొబ్బరి నూనె. బాదం, ఆలివ్ లేదా బీబీ ఆయిల్ ను కలపండి. ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి ఎండిన తరువాత కడిగి వేయండి.
బొప్పాయి పండు ఫేస్ మాస్క్
బొప్పాయి పండును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, వీటిని దంచండి. దీనికి రెండు చెంచాల ఓట్మీల్, రెండు గుడ్ల యొక్క తెల్ల సొన మరియు నిమ్మరసం కలపండి. గుడ్డు తెల్ల సొన మరియు ఓట్మీల్ కు బదులుగా గ్రైండ్ చేసిన బాదం మరియు తేనెను కూడా కలపవచ్చు. చేతి వేళ్ళ సహాయంతో ఈ మిశ్రమాన్ని ముఖ చర్మానికి అప్ప్లై చేయండి. కానీ కంటి ప్రాంతంలో మాత్రం అప్లై చేయకండి. అప్లై చేసిన తరువాత 10 నిమిషాల పాటూ అలాగే వదిలేసి, తరువాత కడిగి వేయండి.
ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ మాస్క్ లు చాలా సురక్షితం మరియు సహజంగా చర్మం యొక్క రూపాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని వాడి మెరిసే చర్మాన్ని పొందండి.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







