అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తున్న11 మంది అరెస్టు
- October 14, 2016
అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తున్న11 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఎనిమిదిమంది భారతీయులు ఉన్నారు. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్, డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో వీరు పట్టుబడినట్లు ఓ ప్రకటన పేర్కొంది. వీరంతా ప్యూర్టోరికోలో ప్రవేశిస్తుండగా అరెస్టు చేసినట్లు తెలిపింది. అగదిలలోని రమీ సెక్టర్ ప్రధాన గస్తీ అధికారి రమిరో కరిలో మాట్లాడుతూ భారతదేశం నుంచి అమెరికా చేరుకునేలోగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మోనా పాసేజ్‌ను దాటడం చాలా కష్టమని తెలిపారు. వలసదారులకు ఇది భయానకంగా ఉంటుందన్నారు. సరైన డాక్యుమెంట్లు లేనివారిని రమీ బోర్డర్ పెట్రోల్ స్టేషన్‌కు పంపిస్తారని, అక్కడ తదుపరి దర్యాప్తు జరుగుతుందని వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







