నాన్ సౌదీ జాతీయుల్ని వివాహమాడాలంటే..
- October 14, 2016
మనామా: ఓ సౌదీ వ్యక్తి, నాన్ సౌదీ మహిళను వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా 40 నుంచి 65 ఏళ్ళ వయసు కలిగి ఉండాలి. అలాగే సౌదీ మహిళ నాన్ సౌదీ వ్యక్తిని పెళ్ళాడేందుకు ఖచ్చితంగా 30 నుంచి 55 సంవత్సరాలు కలిగి ఉండాలని కొత్త నిబంధనలు వెల్లడిస్తున్నాయి. సౌదీ జాతీయులు, నాన్ సౌదీలను పెళ్ళాడే క్రమంలో ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 17 కీలకమైన పాయింట్లను చేర్చడం జరిగింది. సౌదీ వ్యక్తి 3,000 సౌదీ రియాల్స్ నెలకు సంపాదిస్తూ ఉండాలి, అలాగే నివసించడానికి తగిన ఇల్లు లేదా అపార్ట్మెంట్ కలిగి ఉండాలి. ఆ వ్యక్తి పెళ్ళాడాలనుకుంటున్న మహిళ వయసు 24 ఏళ్ళు ఉండాలి, వారిద్దరి మధ్యా వయసు తేడా 30 ఏళ్ళకు మించి ఉండకూడదు. దరఖాస్తు దారులు డివోర్స్డ్ అయితే, రెండేళ్ళ తర్వాత మాత్రమే నాన్ సౌదీలను పెళ్ళి చేసుకోడానికి వీలుంది. ఒకవేళ సౌదీ వ్యక్తి, భార్య ఉండగానే రెండో పెళ్ళిని నాన్ సౌదీ మహిళతో జరగాలనుకుంటే, మొదటి భార్య అనారోగ్యంతో బాధపడుతోందని లేదా ఆమె సంతాన భాగ్యానికి నోచుకోనిది అని సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఈ సర్టిఫికెట్ పొందాలి. సౌదీ మహిళ, నాన్ సౌదీ వ్యక్తిని పెళ్ళాడాలంటే ఇద్దరి మధ్యా 10 ఏళ్ళ వయసుని మించి తేడా ఉండకూడదు. ఇలా పలు నిబంధనలతో కొత్త రూల్ ద్వారా మాత్రమే సౌదీ - నాన్ సౌదీ మధ్య వివాహాలకు అంగీకారం తెలపపనున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







