జయరాజన్ రాజీనామా...

- October 14, 2016 , by Maagulf
జయరాజన్ రాజీనామా...

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రివర్గం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి ఈ.పీ. జయరాజన్ నిష్క్రమించారు. రెండు వారాల నుంచి తనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జయరాజన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కీలక నియామకాల్లో ఆయన బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తన నిర్ణయాన్ని శుక్రవారం జరిగిన సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశంలో ప్రకటించారు. సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తీసుకున్న దృఢ నిర్ణయమే జయరాజన్ రాజీనామాకు ప్రధాన కారణమని సమాచారం. జయరాజన్ నిర్ణయాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ పత్రికా సమావేశంలో వెల్లడించారు.ఆయన నిర్ణయంతో సీపీఎంతో పాటు ఎల్‌డీఎఫ్ పేరు ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com