అబ్దుల్ కలాం కు నివాళులర్పించిన నరేంద్ర మోడీ
- October 15, 2016
భారత మాజీ రాష్ట్రపతి 'మిస్సైల్ మ్యాన్' ఏపీజే అబ్దుల్‌కలాం 85వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆయనకు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడికీ ఆదర్శనీయ వ్యక్తి అబ్దుల్ కలాం అంటూ మోదీ కొనియాడారు.
1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయనను ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కరించింది. మంచి వక్తగానే కాక 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'ఇగ్నైటెడ్ మైండ్స్' వంటి పుస్తకాలు రాసి గొప్ప రచియితగానూ పేరుపొందారు. 2015 జులై 27న గుండెపోటుతో కలాం కన్నుమూశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







