శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలకపాత్ర - నాయిని నరసింహారెడ్డి
- October 15, 2016
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన పోలీసు ఎక్స్‌పోను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ఎంతోమంది పోలీసు అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందిస్తున్నారన్నారు. అమరవీరుల త్యాగాలు మరపురానివన్నారు. ఈ ప్రదర్శనలో సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ సహా పోలీసు విభాగాలకు చెందిన అత్యాధునికి తుపాకులు, ఆయుధాలు, కేసుల దర్యాప్తు సందర్భంగా ఉపయోగించే పలు రకాల వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







