కింగ్‌ ఫిష్‌ ధరలు తగ్గే అవకాశం

- October 15, 2016 , by Maagulf
కింగ్‌ ఫిష్‌ ధరలు తగ్గే అవకాశం

దోహా: కింగ్‌ ఫిష్‌ ధరల్లో అనూహ్యంగా తగ్గుదల నమోదు కానుంది. రానున్న రోజుల్లో ధరలు బాగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కింగ్‌ ఫిష్‌ వేటపై నిషేధం నేటితో ముగియడంతో, చేపల వేట పెరగనుంది. తద్వారా మార్కెట్‌లోకి కింగ్‌ ఫిష్‌ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డిమాండ్‌కి మించి కింగ్‌ ఫిష్‌ మార్కెట్‌లోకి వస్తే ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కింగ్‌ ఫిష్‌ ధర 65 ఖతారీ రియాల్స్‌ (కిలో) వరకు ఉంది బ్యాన్‌ కాలంలో. ఈ ధర 20 నుంచి 18 ఖతారీ రియాల్స్‌ వరకు తగ్గవచ్చునని సమాచారమ్‌. ఆగస్ట్‌ 15 నుంచి అక్టోబర్‌ 15 వరకు మూడు నెలలపాటు కింగ్‌ ఫిష్‌ వేటపై బ్యాన్‌ విధించారు. ప్రతి యేడాదీ సముద్రంలో బ్రీడింగ్‌ సీజన్‌ కారణంగా ఈ నిషేధం ఉంటుంది. తద్వారా సముద్ర జీవుల సమతౌల్యం దెబ్బతినకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com