బహరేన్ లో ఘనంగా పద్మశాలీయుల బతుకమ్మ దసరా ఉత్సవాలు

- October 16, 2016 , by Maagulf

పద్మశాలి సమాజ్ బహరేన్ వారి ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ ఉత్సవాలు శుక్రవారం రోజున సెంచురీ హాల్, మనామ లో అతి ఘనంగా జరిగాయి. ఇందులో పద్మశాలీయులు వారి మిత్రులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో దుర్గా మాత పూజ నిర్వహించి, మహిళలందరూ బతుకమ్మ ఆటలు, కోళాటాలు, డాండియా ఆటలు అతి ఉత్సాహంగా ఆడారు, పిల్లలు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల కోసం  ప్రత్యేకించి సంస్థాన్ బండలింగాపూర్ నుండి విచ్చేసిన పద్మశాలి ఆడపడచు, వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి గంగుల వాణి సుదర్షన్ గారిని పద్మశాలి సమాజ్ బహరైన్ మహిళలు సత్కరించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా జరిగిన ఈ ఉత్సవాలకు పద్మశాలి సమాజ్ బహరైన్  చైర్మన్ అల్లె గంగాధర్, కార్యద్యక్షులు కట్టెకోల జనార్ధన్, ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణ, సహ కార్యదర్శి గంగుల సుదర్షన్, కోశాధికారి మేరుగు శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ కార్యదర్శి మాదాసు కృష్ణహరి, సలహాదారులు నల్లగొండ రమేశ్, సాంస్కృతిక కార్యదర్శి నందగిరి గంగాధర్, ప్రచార కార్యదర్షి యేముల సుధాకర్, కార్యవర్గ సభ్యులు నాయిని మధుకర్, బోగ సత్యనారాయణ, మాదాసు విజయ్, అల్లె రవీందరు, సహ కార్యవర్గ సభ్యలు మరియు తదితరులు పాల్గొన్నారు.                         


--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహరేన్ )

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com