జర్మనీలో భారీ పేలుడు..

- October 17, 2016 , by Maagulf

 

జర్మనీ లుద్విగ్‌షెఫెన్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిందని అధికారులు తెలిపారు. ఘటనలో పలువురు గల్లంతయ్యారు. అనేకమంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు అనంతరం చెలరేగిన మంటలను ఆర్పేందుకు పెద్ద సంఖ్యలో ఫైరింజన్లను ఘటనా స్థలానికి తరలించారు. పేలుడుకు గల కారణాలపై విచారణకు ఆదేశించారు. కెమికల్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల వారు పేలుడు తర్వాత నల్లటి మేఘాలను, ఎగసిపడుతున్న మంటలను చూశామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ కెమికల్ ఫ్యాక్టరీలో 33 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్స్, ఫెర్టిలైజర్స్ ఇక్కడ తయారౌతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com