ఈ ఏడాది హయ్యస్ట్ బిజినెస్ చేసిన హీరో జూనియర్ ఎన్టీఆర్
- October 17, 2016
టాలీవుడ్ లో ఒక ఏడాది ఒక హీరో సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయి... అసలు టాలీవుడ్ సినిమాల మార్కెట్ ఎంత? పెద్ద హీరోల మూవీస్ ఎంత బిజినెస్ చేస్తాయి? ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఈ ఏడాది హయ్యస్ట్ బిజినెస్ చేసిన ఓ హీరో వెంటనే గుర్తుకొస్తాడు. చాలా కాలంగా అంటే గత పది పన్నెండేళ్లుగా పక్కాగా ఓ హిట్ అంటూ లేక బాధపడుతున్న ఆ టాలీవుడ్ హీరో ఈ ఏడాది ఏకంగా కలెక్షన్స్ లో కొత్త రికార్డునే క్రియేట్ చేశాడు.జూనియర్ ఎన్టీఆర్‌కి 2016 బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అతనికి నిజంగా ఇది గోల్డెన్ ఇయర్. యంగ్ టైగర్ కు దాదాపు 12 ఏళ్లుగా సరైన హిట్ పడలేదు. జనతా గ్యారేజ్ సక్సెస్ సందర్భంగా ఎన్టీఆర్ స్వయంగా ఈ సంగతి చెప్పాడు.ఇంతకాలానికి తన కృషి ఫలించిందన్నాడు. ఇన్నేళ్లుగా హిట్ కోసం తపించానన్నాడు. అలాంటిది ఒకే ఏడాది రెండు హిట్స్ కొట్టేసి నిజంగా టైగర్ అనిపించుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ఇంతకు ముందు ఎన్నడూ ఏ టాలీవుడ్ హీరోకూ దక్కని రికార్డు ఎన్ టిఆర్ కు దక్కబోతోంది.ఇంతకూ జూనియర్ నెలకొల్పే ఆ రికార్డ్ ఏంటంటే...అతను ఈ ఏడాది 200 కోట్ల రూపాయల కలెక్షన్ రికార్డును క్రియేట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు... నాన్నకు ప్రేమతో..., జనతాగ్యారేజ్ ఈ ఏడాది రిలీజయ్యాయి. మొదటిది సెంటిమెంట్ మూవీ అయితే... రెండోది మెసేజ్ మూవీ. నాన్నకు ప్రేమతో... సినిమా వరల్డ్ వైడ్ గా 90 కోట్లు కలెక్ట్ చేసింది.యంగ్ టైగర్ నటించిన జనతా గ్యారేజ్ ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిందని టాక్. ఈ ఏడాది రిలీజైన జూనియర్ ఎన్టీఆర్ రెండు సినిమాలు కలిపి 200 కోట్ల కలెక్షన్ రికార్డును అందుకున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే ఏడాది ఇంత భారీ కలెక్షన్స్ మరే టాలీవుడ్ హీరోకూ రాలేదనే చెప్పాలి. ఇది పరిశ్రమకు గర్వకారణమే కాక...ఎన్టీఆర్ సినిమాల వల్ల ఇండస్ట్రీలో ఎందరో కార్మికుల కుటుంబాలకు ఆసరా ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇక జూనియర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం అక్టోబర్ 23న బుల్లితెరపై సందడి చేయనుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీఆర్ పీ రేటింగ్ ని బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించి నీ సెలవడిగి అనే సాంగ్ ని విడుదల చేశారు. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







