దుబాయ్‌ రోడ్లపై 'న్యూ రాడార్‌'

- October 18, 2016 , by Maagulf
దుబాయ్‌ రోడ్లపై 'న్యూ రాడార్‌'

దుబాయ్‌: దుబాయ్‌ పోలీసులు కొత్త రాడార్‌ని షోకేస్‌ చేశారు. హార్డ్‌ షోల్డర్‌ డ్రైవింగ్‌కి పాల్పడేవారిని ఈ న్యూ రాడార్‌ కనిపెడుతుంది. జిటెక్స్‌ టెక్నాలజీ వీక్‌ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు దుబాయ్‌ పోలీసులు. దుబాయ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ సైఫ్‌ ముహైర్‌ అల్‌ మజ్రోయి మాట్లాడుతూ, ఈ కొత్త రాడార్‌ ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలు, వాహనదారులకు సంబంధించి క్వాలిటీతో కూడిన ఫొటోల్ని తీసే అవకాశం ఉందని తెలిపారు. ట్రయల్‌ ఫేజ్‌లో ఈ కొత్త రాడార్లు అద్భుతంగా పనిచేసినట్లు ట్రాఫిక్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మొహమ్మద్‌ అలి కరమ్‌ చెప్పారు. ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీ ద్వారా ఫ్లాష్‌ లేకుండానే హై రిజల్యూషన్‌ ఫొటోల్ని రిమోట్‌ కంట్రోల్‌ పద్ధతిలో చిత్రీకరించడానికి ఈ కొత్త రాడార్లు ఉపయోగపడ్తాయి. ఈ రాడార్లను రోడ్డు పక్కనే ట్రైపాడ్‌ మరియు బ్యాటరీ సహాయంతో తాత్కాలికంగానూ, ఫిక్స్‌డ్‌పొజిషన్‌లో ఎలక్ట్రానిక్‌ సోర్స్‌ లేదా సోలార్‌ పవర్‌ ద్వారా ఉపయోగించుకునే వీలుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com