24 ఏఎం స్టూడియోస్‌ బ్యానరుపై శివకార్తికేయన్‌ రెండవ సినిమా..

- October 18, 2016 , by Maagulf
24 ఏఎం స్టూడియోస్‌ బ్యానరుపై  శివకార్తికేయన్‌ రెండవ సినిమా..

 'కాక్కిసట్టై' ద్వారా యాక్షన్‌ హీరోగా అడుగుపెట్టడంతోపాటు, పోలీసు అధికారిగా కూడా నటించి మెప్పించారు శివకార్తికేయన్‌. ఆయన మళ్లీ పోలీసుగా కనిపించి మరో యాక్షన్‌ వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. 24 ఏఎం స్టూడియోస్‌ బ్యానరుపై శివకార్తికేయన్‌ హీరోగా నటించిన 'రెమో' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థ నిర్మాణంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా తొలిసారిగా నయనతార నటిస్తున్నారు. నవంబరు 11 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతోంది. మలేషియా, పుణే, ముంబయి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు.ఇందులో శివకార్తికేయన్‌ కోసం పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్రను రూపొందించారట మోహన్‌రాజా. రీమేక్‌లను వదిలిపెట్టి మోహన్‌రాజా దర్శకత్వం వహించిన తొలిచిత్రం 'తని ఒరువన్‌' కూడా పోలీసు కథతో రూపొందినదే. ఇప్పుడు మోహన్‌రాజా, శివకార్తికేయన్‌లు ఇద్దరూ పోలీసు కథతోనే ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com