సాయికుమార్ డైరెక్షన్‌లో గాలి జనార్థన్‌రెడ్డి కూతురు పెళ్లి...

- October 18, 2016 , by Maagulf
సాయికుమార్ డైరెక్షన్‌లో గాలి జనార్థన్‌రెడ్డి కూతురు పెళ్లి...

మైనింగ్ ఘనుడు, రిచెస్ట్ పొలిటిషియన్ గాలి జనార్థన్‌రెడ్డి తన కూతురు మ్యారేజ్‌ను ఘనంగా ప్లాన్ చేశాడు. దాదాపు 200 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. చరిత్రలో నిలిచిపోయే విధంగా బళ్లారిలో నవంబర్ 15, 16 తేదీల్లో మ్యారేజ్ ప్రధాన వేడుక అట్టహాసంగా జరగనుంది. టోటల్‌గా చూస్తే మొత్తమ్మీద 9 రోజులపాటు నిర్వహించేలా స్కెచ్ వేసినట్టు ఆయన సహచరులు చెబుతున్నమాట. గాలి జనార్థన్‌రెడ్డి కూతురు బ్రహ్మణికి హైదరాబాద్ బేస్డ్ పారిశ్రామికవేత్త కొడుకు రాజీవ్‌రెడ్డితో పెళ్లి జరగనుంది. ఇదిలావుండగా ప్రముఖ నటుడు సాయికుమార్ డైరెక్షన్‌లో భారీగా పెళ్లి వేడుక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ బెంగుళూరులో జరిగింది.పెళ్లిలో ఫిల్మ్‌స్టార్స్‌తో పర్ఫార్మ్ చేయించాలని ఆలోచిస్తున్నారు గాలి సన్నిహితులు. వచ్చేందుకు ఇప్పటికే షారూక్, కత్రినా, తమన్నా, ప్రభుదేవాలు హాజరుకానున్నారట. పెళ్లికి దేశంలోవున్న ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com