కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత పర్యటన
- August 19, 2015
కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత పర్యటిస్తున్నారు. నియోజక వర్గ పర్యటనలో భాగంగా పెంబట్లలో దుబ్బ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం "మన ఊరు - మన ఎంపీ" కార్యక్రమంలో భాగంగా సారంగపూర్ మండలం రేచపల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రజా సమస్యల్ని ఎప్పటి్కప్పుడు పార్లమెంట్లో లేవనెత్తుతున్నామన్నారు. ఏడాదిలోనే 140కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చామన్నారు. గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన ఉపాధిని చూపుతామని తెలిపారు. అరచేతిలో వైకుంఠం చూపే గల్ఫ్ ఏజెంట్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ జిల్లా వాసులకు సూచించారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి గుడ్డిగా గల్ఫ్ విమానాలు ఎక్కొద్దని.. అలాగే ఏజెంట్ల మాయలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిర్ణీత జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







