డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ మాడ్యులర్ పాడ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ
- October 19, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, అలాగే కరీమ్ సంయుక్తంగా డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ ట్రాన్స్‌పోర్టేషన్ మెథడ్‌ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం వినియోగించేందుకోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ మాడ్యులర్ పాడ్స్ - ఎలక్ట్రిక్ పవర్డ్ వాహనాలు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయని ఈ సందర్భంగా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. దుబాయ్ అటానమస్ ట్రాన్స్‌పోర్టేషన్ స్ట్రాటజీలో భాగంగా ఈ ప్రోగ్రామ్‌ని వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్‌ది యూఏఈ మరియు రూలర్ ఆఫ్ దుబాయ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచన మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2030 నాటికి ట్రాన్స్‌పోర్టేషన్‌లో 25 శాతం డ్రైవర్‌లెస్ వాహనాలతో ఉండాలని అంచనాకి వచ్చారు. ఈ డ్రైవర్‌లెస్ పాడ్స్‌ని ఉపయోగించుకునేందుకు వీలుగా కరీమ్ యాప్‌ని కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో డ్రైవర్‌లెస్ పాడ్స్‌ని రానున్న 12 నెలల్లోనే టెస్ట్ రన్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో కరీమ్ పర్‌ఫెక్ట్ పార్టనర్ అని ఆర్‌టిఎ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







