టైఫూన్ హైమా ముప్పు ఫిలిప్పీన్స్కు..
- October 19, 2016
ఫిలిప్పీన్స్కు టైఫూన్ హైమా ముప్పు పొంచిఉంది. దీంతో దేశ ఉత్తరతీరంలో పలు ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. గత మూడేళ్లలో వచ్చిన టైఫూన్లలో ఇదే అత్యంత బలమైందిగా భావిస్తున్నారు. ఈ టైఫూన్ ఐదో కేటగిరికి చెందినదిగా వాతావరణ శాస్త్రజ్ఞలు చెబుతున్నారు. దీని కారణంగా భారీగా వరదలు, కొండచరియలు విరిగిపడడం, భూమి కోతకు గురికావడం, దాదాపు 16.5 అడుగుల ఎత్తువరకు అలలు ఎగసిపడటం వంటివి జరుగుతాయన్నారు.ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని విమానాలను రద్దు చేశారు. సముద్రంలో వేటపై కోస్టుగార్డ్ విభాగం నిషేధం విధించింది. ఈ టైఫూన్ ఎక్కువ ప్రాంతాలకు విస్తరించి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







