ప్రవాస భారత క్లబ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కోసం ఎంట్రీలకు ఆహ్వానం

- October 20, 2016 , by Maagulf
ప్రవాస భారత క్లబ్  ఫుట్ బాల్  టోర్నమెంట్  కోసం ఎంట్రీలకు ఆహ్వానం

మనామా: నవంబర్ మొదటి వారంలో భారత క్లబ్ ' ఫైవ్ ఏ సైడ్ భారత ప్రవాస ఫుట్ బాల్ టోర్నమెంట్'  జరుగనున్నట్లు క్రీడా నిర్వాహుకులు తెలిపారు. ఈ పోటీలలో 15 ఏళ్ళ లోపు ,19 ఏళ్ళ లోపు వయస్సు గలవారికి అలాగే వయోపరిమితి లేకుండా ఎవరైనా పాల్గొనే విధంగా ఓపెన్ విభాగంలో టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. తొమ్మిదిమంది  క్రీడాకారులతో కూడిన జట్లు ఎంట్రీ నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఫుట్ బాల్  టోర్నమెంట్  కోసం పాల్గొనే జట్లు తమ పేరు నమోదు చేయడం కోసం ముగింపు తేదీ నవంబర్ 1 వ తేదీగా నిర్ణయించారు. మూడు విభాగాల్లో కనీసం సుమారు 50 జట్లు వరకు  ఫుట్ బాల్  పోటీలలో    పాల్గొనవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com