వైవిధ్యమైన పాత్రలు వస్తేనే నటిస్తా: త్రిష.
- October 20, 2016
'అరణ్మనై 2'లో దెయ్యంగా నటించి మెప్పించారు త్రిష. ఆ తర్వాత 'నాయికి'గా కూడా తెలుగు, తమిళ ప్రేక్షకులను బెంబేలెత్తించారు. ఈ నేపథ్యంలో ఆమె మరో దెయ్యం సినిమాకు సిద్ధమయ్యారు. ఆర్ మాధేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మోహిని' అని పేరు పెట్టారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రచండ రూపంలో కనిపిస్తోంది త్రిష. కథలోకి వెళితే.. ఓ ముఠా హతమార్చడంతో దెయ్యంగా మారుతున్న త్రిష వారిని హతమార్చేందుకు ప్రయత్నిస్తుంది. దేశవిదేశాల్లో ఉన్న ఆ వ్యక్తులను ఎలా హతమార్చి పగ తీర్చుకుందన్న విషయాన్ని ఆసక్తికరంగా చెప్పామని అంటున్నారు దర్శకుడు మాదేష్.ఆయన గతంలో విజయ్ హీరోగా 'మదుర' అనే సినిమాను తెరకెక్కించారు. సినిమా గురించి త్రిష మాట్లాడుతూ.. నేను మునుపటిలా లేను. కథ విని నా పాత్ర నచ్చితేనే నటిస్తున్నా.ఓ నటిగా పలురకాల నటనను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం వరుసగా దెయ్యం చిత్రాలను ఎంచుకుంటున్నా. ఆ రకంగా నేను సంతృప్తి పొందాను. ఇకపై దెయ్యం చిత్రాలపై పెద్దగా ఆసక్తి కనబరచను. బహుశా నా చివరి దెయ్యం సినిమా 'మోహిని' కావచ్చు.వైవిధ్యమైన పాత్రలు వస్తేనే ఇకపై నటిస్తానని చెప్పారు త్రిష.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







