రాజుగారి చేపల కథ
- August 19, 2015
అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు తన రాజ్యానికి తూర్పు వైపు ఉన్న ఒక కొలను దగ్గరకు వెళ్లి విశ్రాంతి సమయాన్ని ప్రశాంతంగా గడిపేవారు. ఆ కొలనులోని కలువలు రాజును పలకరిస్తున్నట్టుగా ఆయనను చూసి నవ్వుతున్నట్లుగా రాజు భావించేవాడు. అయితే ఆ కొలనుకు మరింత అందం తీసుకు రావాలని రాజుగారు ఆ కొలనులో అందమైన చేపలను పెంచాలని భావించి భటులకు ఆదేశించాడు. భటులు రంగు రంగుల చేపలను తీసుకుని వచ్చి రాణిగారి చేతికి ఇచ్చారు. రాణి ఆ చేపలను చూసి రకరకాల కూరలు వండమని వంటగత్తెలకు సూచించింది. రాజు ఆ రోజు వంటలను ఆస్వాదిస్తూ పుష్టిగా భోజనం చేశాడు. ఆ తరువాత భటులకు ఆదేశించిన చేపల సంగతి గుర్తుకు వచ్చి వారిని పిలిచి అడుగగా రాణిగారికిచ్చిన సంగతి తెలియజేశారు భటులు. రాణిని పిలిచి అడుగగా వంట సంగతిని చెప్పింది. అంతే కాకుండా మీరు నాకు ఆ సంగతిని చెప్పనే లేదు నాకు కూడా కొలనులో వేసే చేపల విషయాన్ని ప్రస్తావించి ఉండుంటే బాగుండేది అని ఆమె విస్తుపోయింది. దాంతో ఆయనే అసలు విషయాన్ని ప్రస్తావించకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందనీ తరువాత భటులకు విషయాన్ని విపులంగా చెప్పి, మరిన్ని రంగురంగుల అందమైన చేపలను తెప్పించి కొలనులో వేయించాడు. అప్పట్నుంచీ ఆ కొలనులోని చేపలను చూస్తూ, రాజు, రాణులు ఇద్దరూ తమ విశ్రాంతి సమయాన్ని ఆనందంగా గడిపేవారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









