తండ్రీ తనయ ల అపురూప చిత్రం త్వరలో

- October 21, 2016 , by Maagulf
తండ్రీ తనయ ల అపురూప చిత్రం త్వరలో

రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ధనుష్ మొదటి నుంచి కూడా దర్శకత్వంపై దృష్టిపెడుతూ వచ్చింది. అలా ఆమె 'త్రీ', 'వాయ్ రాజా వాయ్' సినిమాలకి దర్శకత్వం వహించింది. రజనీకాంత్ జీవితచరిత్ర ఆధారణంగా 'వీరన్' అనే టైటిల్ తో ఒక డాక్యుమెంటరీ చేసే పనిలో వుంది. అలాంటి ఐశ్వర్య ధనుష్ త్వరలో వెండితెరపై కనిపించబోతోంది. అది కూడా ఆమె తండ్రి రజనీ సినిమాలో. ధనుష్ నిర్మాతగా రజనీకాంత్ కథానాయకుడిగా రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ఐశ్వర్య ధనుష్ కనిపించనుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com