ఒప్పందాన్ని అతిక్రమించినందుకు పాక్ కు బుద్ధి చెప్పిన భారత్ జవ్వాన్లు

- October 21, 2016 , by Maagulf
ఒప్పందాన్ని అతిక్రమించినందుకు పాక్ కు బుద్ధి చెప్పిన భారత్ జవ్వాన్లు

భారత్ - పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ రేంజర్లకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు శుక్రవారం నాడు గట్టి షాక్ ఇచ్చారు. పాక్ ఎప్పటికప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా, ఈ రోజు జమ్ములోని హీరా నగర్ సెక్టారులో బీఎస్‌ఎఫ్ పోస్టుల పైన పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ ఆర్మీ పాక్ సైన్యం కాల్పులను ధీటుగా ఎదుర్కొంది. బీఎస్‌ఎఫ్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది, ఏడుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. తద్వారా, సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌కు భారత బలగాలు దిమ్మతిరిగే సమాధానం చెప్పాయి. కాగా, ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవానుకు గాయపడ్డాడు. కాగా, ఇండియన్ ఆర్మీకి కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com