రష్యాలో ప్రమాదవశాత్తు కూలిన హెలికాప్టర్..
- October 21, 2016
రష్యాలో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిన ఘటనలో 21మంది దుర్మరణం చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ప్రాణాలతో రక్షించారు. సైబీరియా యమల్ ద్వీపకల్పంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సందర్భంగా శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ఎంఐ-8 హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని సమాచారం. ప్రమాద స్థలి నుంచి రెండు బ్లాక్ బాక్సులను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డేటా రికార్డర్, వాయిస్ రికార్డులకు సంబంధించి రెండు బ్లాక్ బాక్సులను స్వాధీనం చేసుకున్నామని, ప్రమాదానికి గురైనప్పుడు కారణాలు గుర్తించేలా వాటిని విశ్లేషించాల్సి ఉందని రష్యన్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఫెడరల్ ఏజెన్సీ అధికారి వెల్లడించారు.కాగా ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో 22మంది ప్రయాణికులు, ముగ్గురు విమానా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రుల్లో ఒకరు మొబైల్ ఫోన్ ద్వారా ఎమర్జెనీ విభాగానికి సమాచారం ఇవ్వడంతో స్థానిక సహాయ అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









