మక్కా కేసులో రణధీర్ కుమార్‌సింగ్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం
- October 21, 2016
మక్కా మసీదు బాంబు పేలుడు కేసులో జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి రణధీర్ కుమార్‌సింగ్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మక్కా పేలుడు కేసు తుది విచారణలో భాగంగా సింగ్ కోర్టుకు ఇటీవల హాజరయ్యారు. సున్నితమైన అంశంకావడంతో భద్రతాకారణాల వల్ల మంత్రి వెల్లడించిన అంశాల్ని బహిర్గతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం మరోసారి కోర్టుకు హాజరై రణధీర్‌కుమార్ సింగ్ మరిన్ని వివరాల్ని వెల్లడించనున్నారు. 2007 మే 18న మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడులో 9 మంది మరణించగా.. 50 మంది గాయపడ్డారు. ఈ కేసులో సునీల్‌జోషి, దేవేంద్రగుప్తాతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు...దర్యాప్తులో భాగంగా దేవేంద్రగుప్తా, మంత్రి రణధీర్ కుమార్‌సింగ్‌కు ఉన్న పరిచయం దృష్ట్యా గతంలో స్టేట్మెంట్ రికార్డు చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







