దుబాయ్లో కీ హోల్ సర్జరీ లైవ్ వర్క్ షాప్
- October 22, 2016డాక్టర్ ఆర్.పద్మకూమార్, డైరెక్టర్ ఆఫ్ మిసికాన్ మాట్లాడుతూ, లాప్రోస్కోపీ సర్జరీ అనేది వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ విధానంలో రోగులు చాలా తక్కువ సమయంలో కోలుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. తక్కువ కోతతోనే సర్జరీలు పూర్తవడం వల్ల కాంప్లికేషన్స్ తగ్గుతాయని వివరించారాయన. సన్రైజ్ హాస్పిటల్ గ్రూప్ డాక్టర్లు, తమ పేటెంటెడ్ కీ హోల్ టెక్నిక్స్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. 25 విధాలైన సర్జరీల గురించి తెలిపారు. కోచి నుంచి ఈ లైవ్ వర్క్ షాప్లో పాల్గొన్న ఇంటర్నేషనల్ మోడర్న్ హాస్పిటల్ అబ్స్టెట్రిషియన్ మరియు గైనకాలజీస్ట్ డాక్టర్ అల్పీ ఎస్ పుతిదోమ్ మాట్లాడుతూ, తమ తరఫున మూడు విధాలైన కీహోల్ టెక్నిక్స్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించినట్లు తెలిపారు. సర్వైకల్ కెర్క్లేజ్, ఎండోమిమెట్రిక్టమీ, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ వంటి విధానాలు ఇందులో ముఖ్యమైనవి. వెయ్యి మందికి పైగా అంతర్జాతీయ డాక్టర్లు రెండ్రోజుల లైవ్ సర్జరీ వర్క్ షాప్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు