పిల్ల రాక్షసి ఆడియో, ట్రైలర్ విడుదల
- October 22, 2016
బిచ్చగాడు` వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న మరో చిత్రం పిల్ల రాక్షసి. మలయాళంలో ఘన విజయం సాధించిన `ఆన్ మరియ కలిప్పిలాను` తెలుగులో `పిల్ల రాక్షసి` పేరుతో నవంబర్ 4న విడుదల చేస్తున్నారు. `బిచ్చగాడు` చిత్రానికి తెలుగులో మాటలు, పాటలు అందించిన రచయిత భాషాశ్రీ మలయాళ చిత్రం `ఆన్ మరియ కలిప్పిలాను` తెలుగు అనువాదానికి మాటలు, పాటలు అందించారు. ఓ ఫ్రాడ్స్టర్తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే పిల్ల రాక్షసి. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లను హీరో నరేశ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
హీరో నరేశ్ మాట్లాడుతూ ' బిచ్చగాడులాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకోసం వందరోజులపాటు ఆడేలా చూసిన నిర్మాతల నుండి పిల్ల రాక్షసి అనే సినిమా వస్తుందంటేనే వాళ్ళ అభిరుచి ఎంతబాగుందో అర్థమైపోతోంది. తెలుగులో విభిన్న కాన్సెప్టులతో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నైరు. మళయాళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.'
చదలవాడ తిరుపతి రావు మాట్లాడుతూ ' ఈ అమ్మాయి భవిష్యత్తులో శ్రీదేవిలా పెద్ద హీరోయిన్ అవుతుంది. పిల్ల రాక్షసి పెద్ద విజయాన్ని అందుకుంటుందని నేను కోరుకుంటున్నాను.'
హీరోయిన్ జాన్ కైప్పలిల్ మాట్లాడుతూ ' ఈ సినిమా తెలుగులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. మా అందరికీ నిజంగా లైఫ్ ఇచ్చింది. తెలుగులో ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. '
దర్శకుడు మిథున్ మాట్లాడుతూ ' మమ్మల్నందరినీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న చదలవాడ లక్ష్మణ్ కి ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులకు పిల్ల రాక్షసి తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాం. '
చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ ' మంచి సినమా ఏదైనా ఎలాంటి బౌండరీలు లేకుండా అందరికీీ చేరాలన్నదే మా లక్ష్యం. అందుకే బిచ్చగాడు సినిమాను తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకొచ్చైం. ఇప్పుడు పిల్లరాక్షసి సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్ 4న విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం'
`ఓకే బంగారం` ఫేం దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించగా, సారా అర్జున్ టైటిల్ పాత్రలో నటించింది. సన్ని వాయ్నే, అజు వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







