ధర్మయోగి పాటల సందడి
- October 22, 2016
'రఘువరన్ బి.టెక్' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ధనుష్ తాజాగా ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి'(ది లీడర్) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోపలువురు సినీ ప్రముఖుల నడుమ వైభవంగా జరిగింది. హీరో ధనుష్ 'ధర్మయోగి' సీడీని ఆవిష్కరించారు. 'కబాలి' సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది.
ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ - "ఈ సినిమాకి వర్క్ చేసిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు, 'ధర్మయోగి'గా తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత సతీష్‌కుమార్‌కు నా ధన్యవాదాలు. నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ డూయెల్ రోల్ చేశాను. ఇది అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో వున్నాయి. పాటలు బాగా వచ్చాయి. ఇప్పటికే తమిళ్‌లో చాలా పెద్ద హిట్ అయ్యాయి. తెలుగులో కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. మళ్ళీ దీపావళికి అందర్నీ కలుస్తాను" అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీకృష్ణ, భరత్‌చౌదరి, సురేష్ కొండేటి, డైరెక్టర్ శశిభూషణ్, రాజ్ మాదిరాజ్, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ ఎస్., ఎడిటింగ్: ప్రకాష్ మబ్బు, సంగీతం: సంతోష్ నారాయణన్, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్.సతీష్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







