మోహన్ లాల్ తో అల్లు శిరీష్...
- October 22, 2016
స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మల్లూవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడా క్రేజ్ ను దక్కించుకోబోతున్నాడు.. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్. ఇటీవలే శ్రీరస్తు శుభమస్తు వంటి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చిత్రంతో మంచి ఊపు మీదున్న శిరీష్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి స్క్రీన్ చేసుకోబోతున్నాడు అల్లు శిరీష్. అది కూడా ఓ యూనివర్శల్ సబ్జెక్ట్ ద్వారా.... ఓ మంచి పాత్రతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని శిరీష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోహన్ లాల్ కథానాయకుడిగా 1971 బియాండ్ బోర్డర్స్ అనే చిత్రం రూపొందించనున్నారు. ఈ చిత్రంలోనే అల్లు శిరీష్ ట్యాంక్ కమాండర్ గా కీలక రోల్ ప్లే చేయనున్నారు. మలయాళ క్రేజీ డైరెక్టర్ మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.... మోహన్ లాల్ గారితో కలిసి నటించే అవకాశం తొలి సినిమాకే రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు ఇదే సరైన సబ్జెక్ట్ అని భావిస్తున్నాు. 1971 బియాండ్ బోర్డర్స్ పేరుతో రూపొందించబోయే ఈ చిత్రంలో ట్యాంక్ కమాండర్ గా ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాను. ఈ చిత్ర కథ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా రూపొందించట్లేదు. హ్యూమన్ డ్రామా, ఎమోషన్స్ తో కూడిన చిత్రమిది. ప్రతీ భారతీయుడు గర్వపడే రీతిలో ఉండే ఈ చిత్రాన్ని కోరుకుంటాడని ఆశిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. అని అన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









