మాదకద్రవ్యాలు విక్రయించినందుకు జైలుశిక్ష
- October 23, 2016
మనామా: మాదకద్రవ్యాలు విక్రయించినందుకు ఒక బహ్రేయినీ వ్యక్తికి పది సంవత్సరాలు జైలుశిక్ష తో పాటు 5000 బి డీ ల జరిమానా విధించారు.ఆంతరంగిక మంత్రిత్వ శాఖలో భాగమైన మాదక ద్రవ్యాల వ్యతిరేక విభాగం అందుకున్న ఒక కిటుకు ఆధారంగా,ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించి అనుమానితుడిని అదుపులోనికి తీసుకోవడం జరిగింది.ఆపరేషన్ సమయంలో ఒక రహస్య పోలీసు అధికారికి ప్రతివాది100 బి డి విలువ చేసే గంజాయి విక్రయించాడని నివేదికలో పేర్కొన్నారు. గంజాయి విక్రేత అరెస్టు చేసే ముందు పోలీసు అధికారులు ఆ వ్యక్తి అపార్ట్మెంట్ పై దాడి చేసి అతనికి చెందిన టాబ్ ని స్వాధీనం చేసుకొన్నా తర్వాత అరెస్టు చేశారు.కోర్టులో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసే ముందు పోలీసులు అతని ఇంటి నుండి వివిధ రకాలైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు. దోషిగా అతనిపై పలు కోణాలలో అభియోగాలు మోపి కేసును బలంగా నమోదు చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







