ఆర్ధిక సాయం చేసిన బన్నీ
- October 23, 2016
అభిమానుల్లో మెగా అభిమానులు వేరు.. మెగా స్టార్ చిరంజీవి అభిమానులను తన ఫ్యామిలీ అని చెప్పేవారు.. అభిమానులు కూడా తమ హీరో ఒక్క మాట చెబితే చాలు మేము రామ భక్త హనుమాన్ లా ఆచరించి చూపిస్తాం అనే విధంగా నడుచుకుంటారు. చిరు పిలుపుతో.. రక్తదానం, తమ కళ్లను దానం ఇవ్వడం వంటి కార్యక్రమాలను నిర్వహించూస్తేనే.. అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.. ఐతే ఇది ఒకవైపు మాత్రమే.. తమ అభిమాన హీరో కోసం అభిమానులు అభిమానం చూపించే విధానం.. తమ కోసం ఏమి చెయ్యడానికైనా వెనుకాడని అభిమానులకు ఎప్పుడైనా ఆపదకలిగితే మెగా హీరోలు మేమున్నాం అంటూ ముందుకొస్తారు.. వారిని ఆదుకొంటారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితరులు తమ అభిమానులను కష్టం లో ఉంటే వారికి ఆర్ధిక సాయం అందించి.. మా అభిమానులు కష్టంలో ఉంటే మేము సైతం అంటున్నారు.. తాజాగా అల్లు అర్జున్ తన అభిమాని ఎనిమిది నెలల చిన్నారి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నదని.. వైద్య సహాయం నిమిత్తం ఎదురు చూస్తున్నారని తెలిసి.. మెగా అభిమానులు తమ వంతు సాయం చేయగా... అల్లు అర్జున్ కూడా తన వంతు సాయంగా చిన్నారి వైద్య సహాయం నిమిత్తం ఆర్ధిక సాయం అందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







