హాస్య నటుడు బ్రహ్మానందం దర్శకుడిగా మారుతున్నాడు...
- October 24, 2016
హాస్య నటుడు బ్రహ్మానందం దర్శకుడిగా మారుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమెడియన్ గా బ్రహ్మీ నెమ్మదించాడు. ఏడాదికి రికార్డు స్థాయిలో పదిహేను చిత్రాలు చేసిన ఈ హాస్యనటుడు.ఇప్పుడు నటిస్తున్న చిత్రాలు చాలా తక్కువగానే ఉంటున్నాయి. కొత్త హాస్యనటులు రావడం, బ్రహ్మానందం చేసిన సినిమాలు సరిగా ఆడకపోవడం ఈ పరిస్థితికి కారణమైంది. ఏదేమైనా ఏడాదంతా బిజీగా ఉండే బ్రహ్మానందానికి ఇప్పుడే కాస్తంత విశ్రాంతి దొరుకుతోంది. ఈ సమయంలో తను చేయాలని అనుకుని చేయలేకపోయిన పనులపై దృష్టిపెట్టాడు బ్రహ్మీ. అందులో దర్శకత్వమూ ఉంది. త్వరలో ఈ హాస్యనటుడు తన దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు సమాచారం. టీవీ షోల ద్వారా గుర్తింపుతెచ్చుకున్న తారలు అనసూయ, రశ్మీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తారని తెలుస్తోంది.ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తారట బ్రహ్మీ.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







