కాలిఫోర్నియాలో రోడ్డుప్రమాదం :13మంది మృతి, 31మంది గాయాలు..
- October 24, 2016
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. 31 మంది గాయపడ్డారు.పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఆదివారం రాత్రి అదుపుతప్పి ట్రాక్టరును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఉత్తర కాలిఫోర్నియా నుంచి లాస్ఏంజిల్స్ వైపు ప్రయాణిస్తున్న పర్యటకుల బస్సు పామ్ స్ప్రింగ్స్ వద్దకు రాగానే అదుపుతప్పి ట్రాక్టర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా 13మంది అక్కడిక్కడే మృతిచెందగా మరో 31మంది గాయాలపాలయ్యారుసమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ప్రమాదానికి కారణం అతివేగమా? లేక డ్రైవర్ మద్యం సేవించడమా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







