నాని దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్...

- October 24, 2016 , by Maagulf
నాని దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్...

నాని దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం రాబోతోంది. అదేంటీ.. ? నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన విషయం తెలిసిందే. డైరెక్టర్ గా ఎప్పుడు మారాడు.. ? అనుకునేరూ !. ఈ నాని వేరు. ఇతడు రాజ్‌తరుణ్ "సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు" సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశాడు.
ఆ టైంలోనే నాని రాజ్ తరుణ్ ని ఓ కథతో మెప్పించాడట. ఇప్పుడీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం 'దొంగాట' ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కిట్టుగాడు' సినిమాతో బిజీగా ఉన్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమా తర్వాత నాని సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com