కేసినో రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు
- October 24, 2016
దేశ రాజధాని దిల్లీలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక కేసినో రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు. దీనికి సంబంధించి 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం దక్షిణ దిల్లీలోని నెబ్‌సరయ్‌లో దాడులు చేసి వీరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఆటగాళ్లు, టేబుల్ అటెండెంట్స్, ప్రొప్రైటర్లు ఉన్నట్లు వారు వెల్లడించారు. నిందితుల వద్ద గల రూ.1.37కోట్ల విలువైన టోకెన్లతో పాటుగా, 11 లగ్జరీ కార్లు, అధిక మొత్తంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిపై గాంబ్లింగ్, ఎక్సైజ్‌ల చట్టం కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం కేసినోను సీజ్ చేసి, పరారీలో ఉన్న కేసినో యజమాని, భవన యజమానులకై గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







